Shorts కడప: మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకుని లైంగిక దాడి చేసిన అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె మరణానికి కారణమైన విగ్నేష్ అనే యువకునికి కడప ఫోక్సకోర్టు యావ జీవ కఠిన గారాగార శిక్ష విధించింది. 2024 నవంబర్ 19వ తేదీన కడప జిల్లా బద్వేలు పట్టణ శివారులలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ అమ్మానుష ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్త సంచలమైంది. బద్వేల్ కు చెందిన విగ్నేష్ అలియాస్ సాయి అనే యువకుడు బద్వేల్ పట్టణంలోని రామాంజనేయ నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో సన్నిహితంగా వ్యవహరించేవాడు. కగా విగ్నేష్ కు అంతకుముందే మరో మహిళతో వివాహమైంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని మైనర్ బాలిక విగ్నేష్ ను బలవంత పెట్టడంతో ఆమెను నమ్మించి బద్వేల్ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పట్నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలిక కాలిపోతూ రోడ్డుపైకి రావడంతో అక్కడున్న కొంతమంది బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు 69 మంది సాక్షులను , ఇతర సాంకేతిక ఆధారాలను కోర్టుకు పోక్సో కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నేరం రుజువు కావడంతో నిందితుడికి యావ జీవ కఠిన గారాగార శిక్షను విధించింది. ఈ కేసులో బాధితురాలైన యువతి తన మరణవాంగ్మూలంలో నిందితుడు విగ్నేష్ తనను లోబరుచుకొని పెట్రోల్ పోసినిప్పండించాలని చెప్పడంతో పాటు అతనికి మరణశిక్ష లాంటిది కాకుండా యావత్గీకరణ శిక్ష వేయాలంటూ చేసిన విన్నపాన్ని పరిగణలోకి తీసుకొని యావజ్జీవ కారగార శిక్ష విధించినట్లు కోర్టు జడ్జి సోమశేఖర్ తీర్పు వెల్లడించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్ తెలిపారు