కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ హ్యాట్రిక్‌తో చెలరేగాడు. ఈ టోర్నీలో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోటీలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్ వారియర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్, షాదాబ్ ఖాన్ (4-0-16-4), సుఫ్యాన్ మొఖీమ్ (4-0-13-4) ధాటికి 15 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది.వారియర్స్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (16), మవేంద్ర దిండ్యాల్ (11), షాయ్ హోప్ (16), రొమారియో షెపర్డ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయడంతో వారియర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం ఫాల్కన్స్ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 5.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రఖీమ్ కార్న్‌వాల్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి ఫాల్కన్స్‌ను గెలిపించాడు. మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ (13 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఫాల్కన్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా వారియర్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. శుక్రవారం క్వాలిఫయర్-2లో కింగ్స్‌మెన్‌పై గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఫాల్కన్స్‌ను ఎదుర్కొంటుంది. ఇదీ చదవండి: ఆడమ్ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్ మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) హైదరాబాద్ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు) తిరుమల : సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో శ్రీమలయప్ప అభయం (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే