Kaizer News

AIతో విద్యార్థులకు నాణ్యమైన విద్య: అంబేద్కర్ విద్య

AIతో విద్యార్థులకు నాణ్యమైన విద్య: అంబేద్కర్ విద్యా సంస్థలో ఓన్ యువర్ ఏఐ సెషన్

· State - Telangana · v6velugu.com

ముషీరాబాద్, వెలుగు: ఏఐ టూల్స్​ను ఉపయోగించడం వల్ల టీచర్లకు సమయం ఆదా కావడంతో పాటు, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందని సర్వమ్ ఏఐ సహ వ్యవస్థాపకులు ప్రత్యూష్ కుమార్ తెలిపారు. బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలో శనివారం డిగ్రీ, ఎంబీఏ, లా కళాశాల లెక్చరర్లకు ఓన్ యువర్ ఏఐ అనే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఇంట్రడక్షన్ సెషన్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో ఏఐ ప్రాధాన్యత, బోధనలో ఆధునిక పద్ధతులను వివరించారు. మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా లెక్చరర్లు తమ బోధన పద్ధతుల్లో ఏఐని భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి, ప్రిన్సిపాళ్లు డాక్టర్ శేఖర్ మట్ట, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News