Kaizer News

Nuzvid: సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన మంత్రి పా

Nuzvid: సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన మంత్రి పార్థసారథి

· State - Telangana · hmtvlive.com

Shorts నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడులోని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి క్యాంపు కార్యాలయంలో నూజివీడు మున్సిపాలిటీ మరియు నూజివీడు,ఆగిరిపల్లి, ముసునూరు,చాట్రాయి మండలాల్లోని పలు గ్రామాల్లో అనారోగ్యానికి గురై ఇటీవల వైద్య చికిత్సలు చేయించుకున్న 78మంది బాధిత కుటుంబాలకు సుమారు రూ.40,45,202/- విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవని వంటిదని అన్నారు.రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని,దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 104 వాహనం మాదిరిగా 109 వాహనం* గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు చేసి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తుందని అన్నారు.గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని,కానీ కూటమి ప్రభుత్వంలో నూజివీడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు రూ.16 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం కోసం మెరుగైన వైద్య పరికరాల ఏర్పాటుకు వేల కోట్లు ఖర్చు చేశామని,తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు.కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆరోగ్య భద్రతతో సంతోషంగా ఉన్నారన్నారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ బాధను,ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే ఆర్థిక సహాయం అందించిన మంత్రివర్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News