Viral Video : ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒక కారు కొంతమందిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే కారుతో దాడి చేసినట్లు అర్థమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. యూపీ, గ్రేటర్ నోయిడాలోని, నాలెడ్జ్ పార్క్ పరిధిలో శనివారం ఉదయం ఒక కారు వేగంగా వచ్చి, రోడ్డు పక్కన ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. అందులో ఒకరికి ఎక్కువ గాయాలు కాగా.. మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దాడి అనంతరం డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనను అక్కడి వారెవరో వీడియో తీశారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నాలెడ్జ్ పార్క్ పరిధిలోని పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, కారును సీజ్ చేశామని గ్రేటర్ నోయిడా డీసీపీ రవి శంకర్ నిమ్ తెలిపారు