వరంగల్: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం నర్సంపేట, నెక్కొండ మండలాల్లో పర్యటించి మోడల్ హౌస్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మోడల్ హౌస్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశించిన సమయంలో పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మోడల్ హౌస్ నిర్మాణాలు చేపట్టాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో రాంరెడ్డి, నర్సంపేట ఎంపీడీవో శ్రీనివాస్ రావు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’