Kaizer News

Veeraballi: టీడీపీ సీనియర్ కార్యకర్త రవీందర్ రాజు

Veeraballi: టీడీపీ సీనియర్ కార్యకర్త రవీందర్ రాజు మృతి..నివాళులర్పించిన నేతలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Veeraballi: వీరబల్లి మండలం ఓదివేడు గ్రామం, రామాపురం కు చెందిన చమర్తి రవీందర్ రాజు గారు అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే రాజంపేట అసెంబ్లీ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ రాజు సోదరుడు శిబ్యాల మాజీ సర్పంచ్ చమర్తి విజయ మోహన్ రాజు , వారి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు. చమర్తి రవీందర్ రాజుగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News