మేళ్లచెరువు, వెలుగు: వేపచెట్టు వివాదంలో రెండు హత్యలు జరిగిన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో ఆదివారం కూడా పోలీస్ పికెట్ కొనసాగింది. హత్యకు గురైన అమరబోయిన వెంకటేశ్వర్లు, భూక్యా సైదా అంత్యక్రియలు పూర్తి చేశారు. నిందితుల తండ్రి భూక్యా సైదా అంత్యక్రియలు గ్రామంలో జరపవద్దని గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. గ్రామస్తులపై సైదా కుటుంబ సభ్యులు అక్రమంగా కేసులు బనాయించారని, జైలుకు కూడా వెళ్లొచ్చామని, వారి కుటుంబంతో కొన్నేళ్లుగా మనశ్శాంతి లేకుండా బతుకుతున్నామని తెలిపారు. దీంతో సైదా సొంత పొలంలో పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు