Kaizer News

మరోసారి యూరప్ పర్యటనకు వైఎస్ జగన్.. షరతులతో సీబీఐ

మరోసారి యూరప్ పర్యటనకు వైఎస్ జగన్.. షరతులతో సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్..

· State - Telangana · v6velugu.com

వైసీపీ అధినేత జగన్ మరోసారి యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈమేరకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జగన్ కుటుంబసమేతంగా యూరప్ లో ఉన్న తన కుమార్తెల దగ్గరికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు 15 రోజుల పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య 15 రోజుల పాటు యూరప్ లో పర్యటించనున్నారు జగన్. యూరప్ పర్యటనకు వెళ్లే ముందు మొత్తం టూర్ షెడ్యూల్ ను కోర్టుకు, సీబీఐ అధికారులకు సమర్పించాలని ఆదేశించింది కోర్టు. విదేశీ పర్యటనలో అందుబాటులో ఉండే ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలను సీబీఐకి తప్పనిసరిగా అందించాలని తెలిపింది కోర్టు. అయితే.. అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న క్రమంలో కీలకమైన సమయంలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్తారా అన్న చర్చ జరుగుతోంది

Original source: v6velugu.com
Read more on Kaizer News