ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ ఎన్నికలను కూటమి- వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు ముఖ్య నేతల పార్టీల మార్పు పైనా చర్చ జరుగుతోంది. వైసీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ జనసేనలో చేరుతున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం పైన పూర్తి స్పష్టత వచ్చింది. వైసీపీ ముఖ్యనేత బొత్సా సత్యానారాయణ పార్టీ మార్పు పైన కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. బొత్సా తన కుటుంబంతో సహా జనసేనలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం బొత్సా శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్నారు. మండలిలో ప్రభుత్వం పైన వైసీపీ పక్ష నేతగా పోరాటం చేస్తున్నారు. అయితే.. పవన్ తో మెగా ఫ్యామిలీతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో.. ఆయన స్థానిక ఎన్నికలకు ముందే జనసేనలో చేరుతారని.. ఈ మేరకు చర్చలు జరిగాయని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో, తాజాగా ఈ వ్యవహారం పైన బొత్సా స్పందించారు. పవన్ పైన వ్యాఖ్యానించారు. ఆయన కేబినెట్ సమావేశాలకు వెళ్లటం లేదని.. ఆయన ఖాళీగా ఉన్నారని తెలిసిందని చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారటం పైన ఎవరు ప్రచారం చేస్తున్నారో వారే చెప్పాలని వ్యాఖ్యానించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రత్యర్థిని ఫిక్స్ చేసిన టీడీపీ- అక్కడే అసలు ట్విస్ట్..!! బొత్సా ప్రకటనతో క్లారిటీ బొత్సా అటు మండలిలో.. ఇటు బయటా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. పవన్ పైన విమర్శలు తగ్గించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ పైనే తన రాజకీయ అస్త్రాలను నేరుగా సంధిస్తున్నారు. కాగా, తన కుమార్తె రాజకీయ ఎంట్రీ పైన కొద్ది రోజుల క్రితం స్పష్టత ఇచ్చారు. విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన కుమార్తె పోటీ చేస్తారని వెల్లడించారు. ఇక, డీఎస్సీ పైనా ప్రభుత్వ తీరును తప్పు బడుతూ వరుసగా స్పందిస్తున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా స్థానిక ఎన్నికల పైన బొత్సా ఫోకస్ చేసారు. ఇక, విజయ సాయిరెడ్డి పైనా బొత్సా స్పందించారు. గతంలో కేఏ పాల్ ఇలాగే మాట్లాడే వారని.. ఇప్పుడు సాయిరెడ్డిని ఎద్దేవా చేసారు. దీనికి పాల్ సైతం బొత్సా పైన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాగా.. ఇప్పుడు బొత్సా ఇచ్చిన స్పష్టతతో ఇక ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారానికి ముగింపు పలికినట్లుగా భావిస్తున్నారు