Shorts Kandukur: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని జై భవాని వైన్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో వైన్స్ పూర్తిగా దగ్ధమైంది. వైన్స్ యజమాని నవీన్ కాగా, విజయ్, శరత్ అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం. వీరంతా షాద్‌నగర్ వాస్తవ్యులుగా తెలుస్తోంది. వైన్స్‌లో సుమారు రూ.1.50 కోట్ల విలువైన మద్యం, ఇతర సామగ్రి ఉన్నట్లు సమాచారం. ఉదయం 7 నుంచి 7:30 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 7:40 గంటలకు ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు