Kaizer News

యుద్ధానికి మూల్యం చెల్లిస్తున్నారు

యుద్ధానికి మూల్యం చెల్లిస్తున్నారు

· National - India · sakshi.com

వర్చువల్‌ ఇంటర్వ్యూలో నోబెల్‌ గ్రహీత నర్గీస్‌ వ్యాఖ్యలు దుబాయ్‌: అమెరికా ఆంక్షలు, ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న యుద్ధాలకు మూల్యాన్ని ఇరాన్‌ ప్రజలు చెల్లిస్తున్నారని ఆ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారిణి, నోబెల్‌ గ్రహీత నర్గీస్‌ మహ్మదీ(54) వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు, బలగాల అణచివేత కారణంగా సామాన్యులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. ‘ఒక్కసారి ఇరాన్‌ వీధుల్లోకి వెళ్లి చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏమిటో మీకు అర్థమవుతుంది. వారిప్పుడు మేల్కొన్నారు. హక్కుల కోసం పోరాడాలని తీర్మానించుకున్నారు’ అని మహ్మదీ అన్నారు. ‘నేటి ఇరాన్‌ యువతలో హక్కుల పట్ల అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్పష్టత ఉంది. వారే మాకు ఆశ, శ్వాస’అని ఆమె పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన నర్గీస్‌ మహ్మదీని ఇరాన్‌ ప్రభుత్వం జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేసింది. శుక్రవారం ఆమె అసోసియేటెడ్‌ ప్రెస్‌కు ఇచి్చన వర్చువల్‌ ఇంటర్వ్యూలో తన నిర్బంధానికి సంబంధించిన వివిధ అంశాలను ఆమె వివరించారు. బాల్యంతోపాటు జైలులో ఉన్న సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రాసిన ‘ఎ ఉమన్‌ నెవర్‌ స్టాప్స్‌ ఫైటింగ్‌’ పుస్తకం ఫ్రెంచి, జర్మన్, తదితర 9 భాషల్లో ఈ నెలలో విడుదల కానుంది. ఇంగ్లి‹Ù, పార్సీ ఎడిషన్లు వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. అమెరికాతో కొనసాగుతున్న యుద్ధం, ముదిరిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఇరాన్‌ ప్రజలు పలు రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారని, భారీ మూల్యం చెల్లిస్తున్నారని మహ్మదీ పేర్కొన్నారు. తమ పాలకులపై ఇరాన్‌ వాసుల్లో నిశ్శబ్దంగా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందంటూ ఆమె ఇస్లాం డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించిన కారణంగా 22 ఏళ్ల మహ్సా అమీనిని అధికారులు నిర్బంధించడం, అనంతరం ఆమె ఆస్పత్రిలో చనిపోవడంతో మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కొనసాగిన విషయాన్ని ప్రస్తావించారు. అమీనిని స్మరించుకుంటూ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న నర్గీస్‌ మహ్మదీకి ఇరాన్‌ ప్రభుత్వం వివిధ ఆరోపణలు మోపి మొత్తం 44 ఏళ్ల జైలు శిక్షలు విధించిన సంగతి తెలిసిందే. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News