Kaizer News

ప్యారడైజ్ సెకండ్ సింగిల్.. ఏష నాగుల కట్ట మీద ఏసిన

ప్యారడైజ్ సెకండ్ సింగిల్.. ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ వచ్చేసింది..

· Entertainment · tv9telugu.com

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్యారడైజ్. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అలాగే మొన్నామధ్య విడుదలైన ఆయా షేర్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ను షేక్ చేసింది ఈ సాంగ్. ఇప్పటికే మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సాంగ్. కాగా తాజగా ప్యారడైజ్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. ఎప్పటి నుంచో ఈ సినిమాలో తెలంగాణ పాపులర్ సాంగ్ ఏష నాగుల కట్ట మీద అనే సాంగ్ ఉంటుందని ప్రచారం జరిగింది. అనుకున్నట్టే అదే సాంగ్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. తాజాగా డల్లాస్ లో ఈ సినిమా సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. అనిరుద్ ఈ సాంగ్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. సినిమాలో ఈ సాంగ్ స్పెషల్ గా ఉండనుందని తెలుస్తుంది. అలాగే ఈ సాంగ్ లో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సాంగ్ థియేటర్స్ లో షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ఈ పాట కోసం హైదరాబాద్ లో అత్యంత భారీ ఖర్చుతో ఒక ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు చేశారని.. సాంగ్ మొత్తం అక్కడే పూర్తి చేస్తారని సమాచారం. సుమారు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేయనున్నారని.. ఈ పాట థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అంటుంది చిత్రయూనిట్. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. సాంగ్

Original source: tv9telugu.com
Read more on Kaizer News