దక్షిణ కోస్తా రైల్వే వుడ్ పల్ప్ రవాణాను రైలు మార్గానికి మళ్లించింది. టారిఫ్ హేతుబద్ధీకరణతో రోడ్డు రవాణా రైలు మార్గానికి మళ్లింది. రైల్వేకు ఏటా రూ.20 కోట్ల అదనపు ఆదాయం అంచనా వేశారు. దక్షిణ కోస్తా రైల్వే చొరవతో రోడ్డు మార్గం నుంచి రైలు మార్గానికి మారిన వుడ్ పల్ప్ రవాణా కాకినాడ: సరుకు రవాణా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే దిగుమతి చేసుకున్న వుడ్ పల్ప్ (కలప గుజ్జు)ను రైలు ద్వారా తరలించి చరిత్ర లిఖించింది. సుదూర ప్రాంతాలకు రవాణాను రోడ్డు మార్గం నుంచి రైలు మార్గానికి మార్చి తరలించడం భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారి. కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు వుడ్ పల్ప్‌ను ఒక సరుకుగా లోడ్ చేయడంతో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. సరుకు రవాణా, ఆదాయానికి రైలు రూపంలో కొత్త వనరును అందుబాటులోకి వచ్చింది. గత 15 ఏళ్లుగా కాకినాడ నుంచి మహారాష్ట్రలోని కాగితపు పరిశ్రమలకు దిగుమతి చేసుకున్న వుడ్ పల్ప్‌ను రోడ్డు మార్గం ద్వారా తరలించేవారు. ఈ రవాణాను రైలు మార్గానికి మళ్లించే అవకాశాలను గుర్తించిన దక్షిణ కోస్తా రైల్వే, పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరిపి, లోడింగ్ అవసరాలు, సుంకాల విధానాన్ని పరిశీలించింది. వాస్తవానికి ఒక్కో వాగన్‌కు 45 నుంచి 50 టన్నుల వుడ్ పల్ప్‌ను మాత్రమే లోడ్ చేయగల సామర్థ్యం ఉంటుంది. అయితే రైల్వే వసూలు చేసే ఛార్జీల విధానం మాత్రం 65.1 టన్నుల సామర్థ్యం ఆధారంగా ఉండటం వల్ల రోడ్డు మార్గంతో పోలిస్తే రైలు రవాణా ఖరీదుగా మారిందని గమనించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, దక్షిణ కోస్తా రైల్వే పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులతో చర్చలు జరిపింది. వుడ్ పల్ప్ రవాణాకు తగిన రేట్లను నిర్ణయించాలని జూలై 2026లో రైల్వే బోర్డుకు ఒక ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదన మేరకు, సరుకు రవాణా టారిఫ్‌లోని క్లాస్-110 కింద వుడ్ పల్ప్‌ను ఒక వస్తువుగా చేర్చడం కలిసొచ్చింది. దీనివల్ల ఈ సరుకు రవాణా ఛార్జీలు భారీగా తగ్గాయి. ఫలితంగా రోడ్డు మార్గం కంటే రైలు మార్గం ద్వారా రవాణా చేయడం చాలా చౌకగా మారింది. ఈ టారిఫ్ తగ్గింపు, ఛార్జీల క్రమబద్ధీకరణ ఫలితంగా, 1,061 కిలోమీటర్ల మేర సుదూర రవాణా రోడ్డు మార్గం నుంచి రైలు మార్గానికి మళ్లించారు. దిగుమతి చేసుకున్న వుడ్ పల్ప్‌ను తీసుకెళ్తున్న మొట్టమొదటి బోస్ట్ (BOST) రేక్ శనివారం నాడు కాకినాడలో లోడ్ కాగా, మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు వెళ్లింది. ఒక్కో రేక్ (గూడ్స్ రైలు) రవాణా ద్వారా దాదాపు రూ. 40 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఈ వుడ్ పల్ప్ రవాణా ద్వారా దక్షిణ కోస్తా రైల్వేకు ఒక్క ఏడాదికి సుమారు 1.5 లక్షల టన్నుల అదనపు లోడింగ్‌తో పాటు, దాదాపు రూ.20 కోట్ల వార్షిక సరుకు రవాణా ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ఈ లాంగ్ జర్నీని రోడ్డు మార్గం నుంచి రైలు మార్గానికి విజయవంతంగా మళ్లించడం ద్వారా కస్టమర్-ఆధారిత సరుకు రవాణా వ్యాపారాభివృద్ధి, టారిఫ్ హేతుబద్ధీకరణ జరిగింది. దాంతోపాటు రైల్వే వ్యవస్థకు కొత్త రవాణా మార్గాలను ఆకర్షించే దిశగా దక్షిణ కోస్తా రైల్వే చేస్తున్న నిరంతర కృషిని ప్రతిబింబిస్తుంది. ఈ రవాణా మార్గాన్ని గుర్తించి, రోడ్డు మార్గం నుంచి రైలు మార్గానికి విజయవంతంగా మళ్లించడంలో