Kaizer News

8 Left-wing parties | ఒకే గొడుగు కిందకు ఎర్రజెండాల

8 Left-wing parties | ఒకే గొడుగు కిందకు ఎర్రజెండాలు..!

· State - Telangana · prabhanews.com

బుల్లెట్ వదిలిన మావోయిస్టు మాజీలు బ్యాలెట్ వైపు అడుగులు..! తెలంగాణలో తెరపైకి వామపక్ష రాజకీయ ఐక్య సమీకరణలు..! సిపిఐ, సిపిఎంతో పాటు జతకట్టిన 8 వామపక్ష పార్టీలు ..! రానున్న ఎన్నికలే ఎజెండాగా వామపక్ష పార్టీల కూటమి సమర శంఖం..! ఉచిత విద్య, వైద్యం.. ఉద్యోగం, ఉపాధి, రైతు సమస్యలే లక్ష్యంగా ప్రజల్లోకి..! కొత్త రాజకీయ కూటమికి మాజీ మావో అగ్రనేత లంక పాపిరెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య నాయకత్వం..! విధి విధానాలతో త్వరలో భవిష్యత్ కార్యాచరణ ..! 8 Left-wing parties | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : తెలంగాణలో ఎర్రజెండాల నీడన సరికొత్త రాజకీయ సమీకరణలతో కూటమి పురుడుపోసుకోనుంది. వామపక్ష భావజాలం కలిగి ఉన్న సుమారు ఎనిమిది ఎర్ర జెండా పార్టీలు, కగార్ ఆపరేషన్ తో కకావికలమైన మావోయిస్టు పార్టీలు, లొంగిపోయిన మాజీలు, ప్రజా సంఘాలు, మేధావులతో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి అవతరించనుంది. ఇప్పటికే నిర్మల్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సమావేశమై ఆలోచనలు పంచుకున్న మాజీ మావోయిస్టులు ఐక్య కూటమితో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించి రానున్న ఎన్నికల్లో పీడిత వర్గాలు, ఆదివాసీ సంఘాల మద్దతుతో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, రైతు సమస్యలే ప్రధాన అజెండా..! కేంద్రంలో బిజెపి పార్టీని, రాష్ట్రంలో ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ను గద్దె దించడమే లక్ష్యంగా వామపక్ష పార్టీల కూటమి ఏకమై ముందుకు సాగుతోంది. వామపక్ష పార్టీల్లో సైద్ధాంతిక భావజాలం కలిగి ఉన్నప్పటికీ విభిన్న అభిప్రాయాలు, దృక్కోణాలను పక్కనపెట్టి బలమైన ఐక్య కూటమిగా ఏర్పడడమే లక్ష్యంగా నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా సిపిఐ, సిపిఎం పార్టీలతో జతకట్టి కమ్యూనిస్టు పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మాజీ మావోయిస్టు అగ్రనేతలు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల మేధావి వర్గాలు కొత్త సమీకరణలతో వ్యూహం రూపొందించాయి. ఇటీవల అదిలాబాద్ జిల్లాలో మృతిచెందిన మాజీ మావోయిస్టు అగ్రనేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న సతీమణి రాధక్క అంత్యక్రియలకు మాజీ మావోయిస్టు అగ్రనేతలు హాజరయ్యారు. కగార్ ఆపరేషన్, భారీ ఎత్తున లొంగుబాట్ల అనంతరం అచేతనంగా ఉన్న సైద్ధాంతిక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకురావాలని, ప్రజా పోరాటాలకు సైతం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ కోణంలోనే ఉద్యమ పార్టీ కూటమిని ఏర్పాటు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరలేదని ప్రధానంగా ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్య, ఉపాధి అవకాశాలతో పాటు రైతాంగ సమస్యలే ప్రధాన ఇజండగా రానున్న ఎన్నికలకు సిద్ధం కావలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇటీవల కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, నిర్మల్ కేంద్రాల్లో జరిగిన సమావేశాల్లోనూ రాజకీయ పార్టీ కూటమి ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ సమావేశాలు అనంతరం రాష్ట్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ఒకే వేదికపైన 8 కమ్యూనిస్టు పార్టీలు జతకట్టి విధివిధానాలతో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించ

Original source: prabhanews.com
Read more on Kaizer News