Kaizer News

Junior Rashmika | ఎయిర్‌పోర్ట్‌లో చీరకట్టుతో మెరిస

Junior Rashmika | ఎయిర్‌పోర్ట్‌లో చీరకట్టుతో మెరిసిన భైరవి.. ‘జూనియర్ రష్మిక’ అంటూ నెటిజన్ల హాట్ కామెంట్స్!

· Entertainment · ntnews.com

Junior Rashmika | ఇండస్ట్రీలో కొంతమంది కొత్త నటీమణులు తమ అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ.. ప్రముఖ హీరోయిన్లను గుర్తుకు తెస్తుంటారు. ఒకప్పుడు ఐశ్వర్యరాయ్ పోలికలతో ఆకట్టుకున్న స్నేహ ఉల్లాల్‌కు ‘జూనియర్ ఐశ్వర్యరాయ్’ అనే పేరు వచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇటీవల తన నటనతో మెప్పించిన కామాక్షి చౌదరి ‘జూనియర్ అనుష్క’గా సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరో యువ నటి తన లేటెస్ట్ లుక్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ‘జూనియర్ రష్మిక’ అనే ట్యాగ్‌తో వైరల్ అవుతోంది.ఆమె ఎవరో కాదు.. అస్సాంకు చెందిన యువ నటి భైరవి ఆర్ధ్య. తాజాగా భైరవి ఆర్ధ్య ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంప్రదాయ చీరకట్టులో ఎంతో హుందాగా కనిపించిన ఆమె.. కారు వైపు నడుచుకుంటూ వెళ్తున్న తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె ముఖ కవళికలు, చిరునవ్వు, కళ్లతో పలికించిన భావాలు చూసిన నెటిజన్లు.. “రష్మిక మందన్నను గుర్తుకు తెస్తోంది”, “ఎవరీ జూనియర్ రష్మిక?” అంటూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తాజా లుక్ సోషల్ మీడియాలో యువత దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.భైరవి ఆర్ధ్య అస్సాంకు చెందిన యువతి. చిన్నప్పటి నుంచే ఆమెకు సినిమాలు, నటనపై ఎంతో ఆసక్తి ఉండేదట. తన కుటుంబ సభ్యులు ఇప్పటికీ అస్సాంలోనే నివసిస్తున్నారని, అయితే నటిగా ఎదగాలనే తన కల కోసం తాను ఎంతో కష్టపడ్డానని గతంలో ఆమె వెల్లడించింది. సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా నటించిన ‘కొత్త మలుపు’ చిత్రంతో భైరవి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. శివ వరప్రసాద్ దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్ల సందర్భంగా భైరవి తన సినీ ప్రయాణంలోని కష్టాలను కూడా పంచుకుంది. చిన్నప్పటి నుంచే తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషల చిత్రాలను చూస్తూ పెరిగానని, క్రమంగా నటిగా మారాలనే కోరిక బలపడిందని తెలిపింది. అయితే తొలుత తనకు తెలుగు భాష అసలు రాదని ఆమె చెప్పింది. అయినప్పటికీ తన కలను వదులుకోకుండా చదువుకుంటూనే ఆడిషన్లలో పాల్గొనడం ప్రారంభించిందట. రెండు, మూడు సంవత్సరాల పాటు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే.. చుట్టూ ఉన్న వారితో తెలుగు మాట్లాడటం ప్రాక్టీస్ చేసి భాషను నేర్చుకుందని వెల్లడించింది

Original source: ntnews.com
Read more on Kaizer News