Medical AI: అలీబాబా రీసెర్చ్ విభాగానికి చెందిన ‘డామో అకాడమీ’ వైద్య రంగంలో ఒక సంచలనాత్మక ఏఐ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘డామో రాడార్’ (Damo Radar) పేరిట విడుదల చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్, బాడీ కాంట్రాస్ట్-ఎన్‌హాన్స్డ్ సీటీ స్కాన్‌లను క్షణ్ణంగా పరిశీలించి రకరకాల వ్యాధులను, క్యాన్సర్ కణుతులను చాలా త్వరగా గుర్తిస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపులోని 18 భాగాలకు చెందిన స్కాన్‌లను పరీక్షించి, దాదాపు 150 రకాల శారీరక రుగ్మతలకు సంబంధించి 146 రకాల క్లినికల్ లక్షణాలను ఇది విశ్లేషించగలదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. హెల్త్‌కేర్, మెడికల్ ఇమేజింగ్ రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తరించేందుకు అలీబాబా వేస్తున్న వేగవంతమైన వడిదుడుకులకు ఇది మరో మైలురాయిలా నిలిచింది