Kaizer News

తియ్య తియ్యని బాదుషా.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయ

తియ్య తియ్యని బాదుషా.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసా?

· State - Telangana · tv9telugu.com

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా బాదుషా కోసం పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. దీని కోసం ఒక గిన్నెలో రెండు కప్పుల పంచదారకు ఒకటిన్నర కప్పు నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టాలి. పంచదార పూర్తిగా కరిగి, పాకం గులాబ్ జామ్ పాకం కంటే కాస్త చిక్కగా వచ్చేలా చూసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత అందులో అర టీస్పూన్ యాలకుల పొడి , వీలైతే కుంకుమ పువ్వు వేసుకోవాలి. అలాగే స్పూన్ నిమ్మరం వేసుకోవాలి. దీని వలన పాకం గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు బాద్ షా కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి. తర్వాత అందులో చిటికెడు ఉప్పు, వంట సోదా , బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే పిండిలో నెయ్యి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చేతితో మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత, పావు కప్పు పులవని, తాజాగా తోడుకున్న పెరుగునుకలపాలి.పెరుగు కలిపిన తర్వాత, నీళ్లను కొద్దికొద్దిగా వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి . పిండిని ఎక్కువ పిసకకూడదు, దాని వల్ల బాదుషాలోని ఎయిర్ గ్యాప్స్ పోయి, పొరలు రావు. కలుపుకున్న పిండి మీద మూతపెట్టి 10-15 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కూడా పిండిని మళ్లీ పిసకకూడదు. ఇప్పుడు నానబెట్టిన పిండి నుంచి చిన్న చిన్న ఉండలను తీసుకుని, అరచేతిలో పెట్టి గుండ్రంగా, కొద్దిగా నొక్కుతూ రోల్ చేయాలి. మధ్యలో రెండు వేళ్లతో చిన్న రంధ్రం చేయాలి. బాదుషాలు ఒత్తేటప్పుడు పైన లేయర్లు విడివిడిగా కనిపించేలా చూసుకోవాలి, వాటిని మరీ నునుపుగా చేయకూడదు. ఇలా చేస్తేనే బాదుషాలు నూనెలో వేసినప్పుడు పువ్వులా విచ్చుకుని, పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. పిండి మొత్తాన్ని ఇలా బాదుషాలుగా ఒత్తుకుని మూతపెట్టి పక్కన ఉంచాలి. డీప్ ఫ్రై కోసం కడాయిలో నూనెను తీసుకోవాలి. నూనె మోడరేట్‌గా వేడి అయి ఉండాలి, మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. బాదుషాను నూనెలో వేసినప్పుడు లైట్‌గా బుడగలు రావాలి. ఎక్కువ వేడిలో వేస్తే బాదుషా లోపల ఉడకదు. నూనెకు సరిపడా బాదుషాలను వేసి, మంటను తక్కువ ఫ్లేమ్‌లో ఉంచి, నెమ్మదిగా పైకి తేలే వరకు కదపకుండా వేయించాలి. అవి పైకి తేలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి, గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు అటూ ఇటూ తిప్పుతూ క్రిస్పీగా వేయించాలి. వేయించిన బాదుషాలను వెంటనే పాకంలోకి వేయాలి. బాదుషాలను పాకంలో వేసిన వెంటనే, ఒక 30 సెకన్ల పాటు గరిటతో పాకంలో ముంచుతూ ఉండాలి. పాకంలో వేసిన బాదుషాలను 4-5 నిమిషాల పాటు నానబెట్టి, తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాలు రెడీ

Original source: tv9telugu.com
Read more on Kaizer News