సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే.. : --> Add as a preferred source on google Best Selfie Camera Phones: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు చాలామంది మొదటగా గమనిస్తున్న అంశం ‘సెల్ఫీ కెమెరా’. బ్రాండ్లు కూడా వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టే హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాలు, ఆటోఫోకస్, మెరుగైన పోర్ట్రెయిట్ ప్రాసెసింగ్, ఏఐ ఫీచర్లను అందిస్తున్నాయి. రూ. 20,000 బడ్జెట్ నుంచి లక్షన్నర వరకు ఉన్న బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్ల వివరాలు ఇక్కడ చూద్దాం. ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో వివో విడుదల చేసిన Vivo X300 Ultra కెమెరా ప్రియులకు ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. వెనుకవైపు OIS సపోర్ట్‌తో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 3.7x ఆప్టికల్ జూమ్ (105x డిజిటల్ జూమ్) ఇచ్చే 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో 8K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఇది 6.82-అంగుళాల 2K 144Hz AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్, 100W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,600mAh బ్యాటరీతో వస్తుంది. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,59,999 కాగా, ఇది ఎక్లిప్స్ బ్లాక్, విక్టరీ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఇక ఫోటోగ్రఫీలో తనదైన ముద్ర వేసిన గూగుల్ నుంచి వచ్చిన Google Pixel 11 Pro XL మోడల్‌లో f/2.2 అపెర్చర్‌తో 42 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. వెనుకవైపు OIS LDAF ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 48 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్, 5x ఆప్టికల్ జూమ్ (120x డిజిటల్ జూమ్) అందించే 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.8-అంగుళాల QHD+ 120Hz AMOLED డిస్‌ప్లే, టెన్సార్ G6 చిప్‌సెట్, 30W వైర్డ్, 25W Qi 2.2 పిక్సెల్ స్నాప్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,115mAh బ్యాటరీ అమర్చారు. కాన్యన్, ఫాగ్, ఆలివ్, అబ్సిడియన్ రంగుల్లో లభించే ఈ ఫోన్ 12GB + 256GB వేరియంట్ ధర రూ. 1,34,999 కాగా, 16GB + 512GB మోడల్ ధర రూ. 1,49,999గా ఉంది. శామ్‌సంగ్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ Samsung Galaxy S26 Ultra కాస్త భిన్నమైన శైలిని ఎంచుకుంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే 12 మెగాపిక్సెల్ f/2.2 ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు f/1.4 అపెర్చర్, OIS ఉన్న 200 మెగాపిక్సెల్ ప్రైమరీ, 5x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో, 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. వీటి ద్వారా 8K, HDR10+ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.9-అంగుళాల డైనమిక్ AMOLED 2X 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్, 16GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్, 60W వైర్డ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. బ్లాక్, బ్లూ, పర్పుల్, వైట్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ధర రూ. 1,34,999 నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 1,49,999 వరకు ఉంటుంది. అప్పర్