Kaizer News

ప్రభుత్వ దవాఖానలో శిశువు మృతి

ప్రభుత్వ దవాఖానలో శిశువు మృతి

· State - Telangana · ntnews.com

వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేనని బంధువుల ఆగ్రహం నారాయణపేటలో పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు నారాయణపేటరూరల్‌, ఆగస్టు 30: నారాయణపేట జిల్లా పరిధి అప్పక్‌పల్లి సమీపంలోని జిల్లా దవాఖానలో ఓ శిశువు మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. దామరగిద్దకు చెందిన ముస్కాన్‌బేగంకు పురిటి నొప్పులు రావడంతో శనివారం రాత్రి 8 గం టలకు దవాఖానకు రాగా, అర్ధరాత్రి 12:00 గంటలకు అడ్మిషన్‌ చేసుకొని పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు మళ్లీ పరీక్షల కోసం వెళ్లగా బేబీ హార్ట్‌బీట్‌ బాగా లేదని వెంటనే సిజేరియన్‌ చేయడానికి తీసుకెళ్లారు. సిజేరియన్‌ అనంతరం తల్లిని ఐసీయూకి తీసుకువెళ్లగా కాసేపటి తర్వాత వైద్యులు బాబు మృతి చెందాడని చెప్పారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలోనే తాము కోరినా సిజేరియన్‌ చేయలేదని, శిశువు మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్‌ ఎస్సై సతీశ్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్‌ఎంవో బాలాజీని వివరణ కోరగా సంబంధిత డాక్టర్‌ ప్రణతికి మెమో జారీ చేశామని, ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు

Original source: ntnews.com
Read more on Kaizer News