Kaizer News

ఎస్టీ మోర్చా దండేపల్లి మండల అధ్యక్షుడిగా గురుప్రసా

ఎస్టీ మోర్చా దండేపల్లి మండల అధ్యక్షుడిగా గురుప్రసాద్‌

· State - Telangana · prabhanews.com

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌రావు దండేపల్లి, ఆంధ్రప్రభ : పార్టీ అప్పగించిన పదవిని బాధ్యతగా భావించి బూత్‌ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌రావు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌తో కలిసి అజ్మీరా గురుప్రసాద్‌ను దండేపల్లి మండల ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా రఘునాథ్‌రావు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అజ్మీరా గురుప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News