Kaizer News

కేటీఆర్‌ ని కలిసిన భూక్యా జాన్సన్ నాయక్

కేటీఆర్‌ ని కలిసిన భూక్యా జాన్సన్ నాయక్

· State - Telangana · prabhanews.com

ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో కలిసి బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ పరిస్థితులు, ఖానాపూర్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై కేటీఆర్ గారితో చర్చించినట్లు జాన్సన్ నాయక్ ‘ఆంధ్ర ప్రభ’ కు ఫోన్ లో తెలిపారు. రానున్న రోజుల్లో నిర్వహించే పార్టీ సంస్థ గత కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News