వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ విజయవాడ, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి స్వర్గీయ నందమూరి హరికృష్ణ వర్ధంతిని పురస్కరించుకుని 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలోని హరికృష్ణ కార్యాలయంలో శనివారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. నందమూరి హరికృష్ణ సేవలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. కార్యక్రమంలో ధనేకుల వెంకట హరికృష్ణ (నాని) మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం, ప్రజల కోసం నందమూరి హరికృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడంతో పాటు మహిళా కండక్టర్లుగా అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆయన చొరవను కొనియాడారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి హరికృష్ణ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ కార్యకర్తలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడమే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గొల్లగాని శివ, పశ్చిమ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బొందిలి తిలక్ రామ్‌సింగ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు