Kaizer News

Sircilla: తాడూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమ

Sircilla: తాడూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ!

· State - Telangana · hmtvlive.com

Sircilla: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు అన్నారు. తాడూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నాయకులు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంతింటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణం పేదలపై ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో సిమెంట్, ఇసుక తదితర నిర్మాణ సామగ్రి ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని తెలిపారు. “ఇది పేదల ప్రభుత్వం.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు. ఇళ్ల మంజూరు విషయంలో ఎలాంటి అవకతవకలు, అక్రమ వసూళ్లకు తావులేదన్నారు. ఇల్లు మంజూరు పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని లబ్ధిదారులకు సూచించారు. ఇల్లు లేని పేదలకు సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని పెంచడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమన్నారు. భూమిపూజతో సొంతింటి నిర్మాణానికి అడుగు పడటంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కల నెరవేరే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరాళ్ల నర్సింగం, సర్పంచ్ సాధి, డైరెక్టర్ శైలజ, సెక్రటరీ కవిత, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, బండి పర్శరం, చేనామనేని ప్రశాంత్, రాజలింగం, ఎగుర్ల ప్రశాంత్, గుగిళ్ల భారత్, శ్రీరామ్, మిరాల శ్రీనివాస్, రంగు శ్రీనివాస్, రవి, ప్రేమ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు, స్థానికులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News