Kaizer News

Renigunta: రేణిగుంట డంపింగ్ యార్డులో భారీగా మంటలు.

Renigunta: రేణిగుంట డంపింగ్ యార్డులో భారీగా మంటలు.. దట్టమైన పొగ!

· State - Telangana · hmtvlive.com

రేణిగుంట: రేణిగుంట మండలం పరిధిలోని శ్రీనివాస కాలేజీ పక్కన ఉన్న పంచాయతీ డంపింగ్ యార్డులో భారీగా మంటలు చెలరేగాయి. చెత్త, పోగలతో కూడిన వ్యర్థాలకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. డంపింగ్ యార్డుకు సమీపంలోనే కాలేజీ, నివాస ప్రాంతాలు ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటల కారణంగా పొగ, దుర్వాసనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. మంటలకు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకోవడంతో పాటు, డంపింగ్ యార్డులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News