Kaizer News

అంబర్ పేట్, మలక్ పేట్ రూట్లో వెళ్లేవారికి గుడ్ న్

అంబర్ పేట్, మలక్ పేట్ రూట్లో వెళ్లేవారికి గుడ్ న్యూస్

· State - Telangana · v6velugu.com

అంబర్ పేట్, మలక్ పేట్ రూట్ లో వెళ్లే వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. మూసీ నదిపై నిర్మించిన ముసారం బాగ్ బ్రిడ్జి ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. బ్రిడ్జి నిర్మాణం పూర్తవటంతో ప్రారంభోత్సవానికి సంబంధించిన కీలక అప్ డేట్ వెల్లడించారు GHMC కమిషనర్ కర్ణన్. 2026 ఆగస్టు 29న మూసారాం బాగ్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన కమిషనర్ సెప్టెంబర్ మొదటి వారంలో బ్రిడ్జ్ ను ప్రారంభిస్తామని చెప్పారు. ముసారాం బాగ్ బ్రిడ్జ్ అందుబాటులో వస్తే అంబర్ పేట, మలక్ పేట కు రాకపోకలు ఈజీ అవుతుందని తెలిపారు. ఎలాంటి వరదలు వచ్చినా తట్టుకునేలా మూసారాం బాగ్ బ్రిడ్జ్ ను నిర్మించినట్లు తెలిపారు. 52 కోట్ల రూపాయలతో మూసీ పైన మూసారాం బాగ్ దగ్గర రెండు బ్రిడ్జ్ లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అందులో ఒక బ్రిడ్జిని వచ్చే వారం ప్రారంభిస్తామని అన్నారు. మరో ఏడాదిలో ఇంకొకటి అందుబాటులోకి తెస్తామని తెలిపారు

Original source: v6velugu.com
Read more on Kaizer News