చేతిలో డబ్బుల్లేక చదువు మధ్యలో ఆగిపోకూడదు.. పేదరికం కారణంగా ప్రతిభ మరుగున పడకూడదు.చదువుకోవాలనే తపన ఉంది... కానీ ఆర్థిక స్థోమత లేదు.. కలలు ఉన్నాయి.. వాటిని సాకారం చేసుకునే అవకాశం లేదు. అందుకే ‘జకాత్’ నిధులతో తెలంగాణలోని వేలాదిమంది అనాథలు, నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తూ.. వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది హైదరాబాద్ నగరంలోని జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ఒకరి దానం.. ఓ విద్యార్థి చదువుకు బాట. ఒక స్కాలర్‌షిప్.. ఓ కుటుంబానికి భవిష్యత్తు. అలా పొందిన ఉపకార వేతనాలతో అనాథలు, నిరుపేదలు కూడా ఉన్నత విద్య అభ్యసించి, ఉద్యోగాలు సాధించి విజయ శిఖరాలను అధిరోహించారు. బేగంపేటలోని హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ 1993వ సంవత్సరంలో ప్రారంభమై మూడు దశాబ్దాలకు పైగా అత్యుత్తమ సేవలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2,05,896 మంది అనాథ, పేద విద్యార్థులకు రూ.68 కోట్లకు పైగా స్కాలర్‌షిప్‌లు అందించి వారి ఉన్నత విద్యకు అండగా నిలిచింది. ప్రతీ ఏటా రమజాన్ నెలలో దాతల నుంచి జకాత్ రూపంలో అందే విరాళాలతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది ట్రస్ట్. సిటీలోని కొందరు దాతలు నగదు, బంగారం, వెండి, పెట్టుబడులు, వ్యాపార లాభాలు, ఆస్తులపై 2.5 శాతం మొత్తాన్ని జకాత్ విరాళంగా ట్రస్టుకు అందిస్తున్నారు. జకాత్ నిధులను పేద విద్యార్థుల చదువునకు వెచ్చించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. 2026- – 27 విద్యా సంవత్సరంలో కూడా10 వేల మందికి పైగా విద్యార్థులకు ఈ ట్రస్ట్ రూ.5 కోట్ల ఉపకార వేతనాలు అందిస్తోంది. స్కాలర్‌షిప్‌తో చదువుకుని జీవితంలో స్థిరపడిన అనాథలు, నిరుపేద విద్యార్థుల విజయగాథలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్ట్ అర్హత గల విద్యార్థికి అండగా నిలచి విద్యను అందుబాటులోకి తీసుకువస్తోంది. ట్రస్ట్ స్కాలర్‌షిప్ ప్రాజెక్ట్ ద్వారా అనాథ, నిరుపేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించడం ద్వారా వారు తమ విద్యా ఆకాంక్షలను కొనసాగించి, వారి కలలను సాకారం చేసుకుంటున్నారు. అనాథ విద్యార్థుల విద్య కోసం ఈ పథకాన్ని ట్రస్ట్ రూపొందించింది. ఈ స్కీం కింద తెలంగాణలో అనాథ పిల్లలకు ఎల్కేజీ నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్ వరకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయడాన్ని నివారించడం, ఈ విద్యార్థులకు వారి విద్యా ప్రయాణం అంతటా మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా 12,000 మందికి పైగా అనాథ విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ట్రస్టు నుంచి లబ్ధి పొందుతున్నారు. ట్రస్ట్ దీని కోసం ఏటా రూ.3 కోట్లు ఖర్చు చేస్తుందని ట్రస్ట్ ప్రతినిధి నిస్కార్ చెప్పారు. వృత్తి రంగాల్లో ప్రతిభను పెంపొందించడం, ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకంగా ఈ స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ట్రస్ట్ ప్రారంభించింది. వృత్తి విద్యా కోర్సుల స్కాలర్‌షిప్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ, లా వంటి కోర్సులను అభ్యసిస్తున్న ప్రతిభ గల విద్యార్థులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా తతట్రస్ట్ పెట్టుకుంది. ఈ కార్యక్రమం విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల భారం లేకుండా వా