పరిగి, వెలుగు: బీజాపూర్ హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఇద్దరు చనిపోయారు. ఆదివారం రాత్రి వికారాబాద్ జిల్లా పరిగి మండలం చింతలచెరువు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఖాజాబీ(65), జాంగిర్ బి(78) చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అక్కడికి చేరుకొని కారు నుంచి డెడ్‌బాడీలు, గాయపడిన వారిని బయటకు తీసి, హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది