ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బదిలీలకు సంబంధించి అధికారులు, వారి కొత్త పోస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్పీఎఫ్ డీజీగా పనిచేస్తున్న సీహెచ్ త్రివిక్రమ వర్మను డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్‌గా ప్రభుత్వం నియమించింది. ఏసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా బదిలీ చేశారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న బి. రాజకుమారిని రైల్వే ఐజీగా బదిలీ చేయడంతో పాటు, సీఐడీ ఉమెన్ […]