Kaizer News

కాంగ్రెస్ ద్వంద్వ నీతి బట్టబయలైంది :మంత్రి హరీశ్ ర

కాంగ్రెస్ ద్వంద్వ నీతి బట్టబయలైంది :మంత్రి హరీశ్ రావు

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: దానం నాగేందర్​ను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ద్వంద్వ నీతిని బట్టబయలు చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి ఫిరాయించడమే కాకుండా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారన్నారు. ప్రజల తీర్పును, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన స్పీకర్ వ్యవస్థ అందుకు విరుద్ధంగా దానం నాగేందర్ కు రక్షణ కవచంగా నిలవడం దురదృష్టకరమన్నారు. ఈ వ్యవహారంలో స్పీకర్ తీరుపై హైకోర్టు తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. హైకోర్టు తీర్పుపై శుక్రవారం ఆయన ఎక్స్​లో కాంగ్రెస్ ను ట్యాగ్​ చేస్తూ పోస్ట్​ పెట్టారు

Original source: v6velugu.com
Read more on Kaizer News