పి ల్లలూ... మనలో చాలా మందికి నిచ్చెన ఎక్కుతున్నప్పుడో లేదా ఎతై ్తన మేడ మీద నిలబడినప్పుడో కాళ్లు లైట్‌గా వణకడం, లోపల ఏదో తెలియని భయం కలగడం జరుగుతుంది కదా! దీనికి కారణం మన మెదడు మనల్ని కాపాడటానికి చేసే ఒక సైంటిఫిక్ మ్యాజిక్! మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మన కళ్లు, మన చెవి లోపల ఉండే ఒక ప్రత్యేక ద్రవం (Vestibular System), కాళ్ల కండరాలు కలిసి బాడీని బ్యాలెన్స్ చేస్తాయి. కానీ నిచ్చెన ఎక్కినప్పుడు కళ్లు స్థిరమైన భూమిని చూడలేవు. దాంతో కళ్లకు, కాళ్లకు అందే సిగ్నల్స్ మ్యాచ్ కాక మెదడు కాస్త కన్ఫ్యూజ్ అవుతుంది. మనం ఎత్తుకు వెళ్లగానే ‘ఎక్కడ కింద పడిపోతామో’ అని మెదడులోని రక్షణ వ్యవస్థ అలర్ట్ అవుతుంది. వెంటనే బాడీలోకి ‘అడ్రినలిన్’ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో మనల్ని పారిపోవడానికి లేదా పోరాడటానికి సిద్ధం చేస్తుంది. ఈ హార్మోన్ ఒక్కసారిగా విడుదల కావడం వల్లే కాళ్లలో వణుకు వస్తుంది. నిచ్చెన ఎక్కేటప్పుడు కిందకు చూడకుండా, కేవలం పైనున్న మెట్లను మాత్రమే చూడాలి. నిచ్చెనను రెండు చేతులతో బలంగా పట్టుకుని, నెమ్మదిగా శ్వాస తీసుకుంటే మెదడు ప్రశాంతపడి వణుకు తగ్గిపోతుంది! ఇవీ చదవండి: వరి పొలంలో 3డీ ఆర్ట్.. రైతుల సూపర్ క్రియేటివిటీ! ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్