Kaizer News

Pedda Dornala: దోర్నాల వెలిగొండ కెనాల్ వద్ద అప్రమత

Pedda Dornala: దోర్నాల వెలిగొండ కెనాల్ వద్ద అప్రమత్తత తప్పనిసరి: ఎస్సై

· State - Telangana · hmtvlive.com

Shorts మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాల వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో నీటి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోర్నాల ఎస్సై ఎస్. వెంకట రమణయ్య సూచించారు. కెనాల్‌ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఎవరూ నీటిలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం, బట్టలు ఉతకడం, తాగునీటి అవసరాలు తదితర పనుల కోసం కెనాల్‌ వద్దకు వచ్చే వారు నీటికి దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత అత్యుత్సాహంతో కెనాల్‌లోకి దిగడం, ప్రవాహానికి సమీపంలో నిలబడి సెల్ఫీలు తీసుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. కెనాల్‌ వద్దకు పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులు వారిపై నిరంతరం నిఘా ఉంచాలని, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై కోరారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలను పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా సహకరించాలని ఎస్. వెంకట రమణయ్య విజ్ఞప్తి చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News