Shorts Srikakulam: తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజులు ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ‘బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 23, 24 తేదీల్లో తుఫాన్‌గా జిల్లాపై ప్రభావం చూపే అవకాశముంది. ఈ ప్రభావంతో ఈ నెల 21 నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు ప్రారంభమై, 22, 23 తేదీలలో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెట గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఈనెల 25 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. కలెక్టరేట్‌లో విపత్తు నిర్వహణ కోసం కంట్రోల్‌రూమ్ 08942 240557 అందుబాటులోకి తెచ్చాం. 11 తీర ప్రాంత మండలాలకు సీనియర్ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించాం. జిల్లాలోని అధికారులందరికీ సెలవులు రద్దు చేశాం. సోమవారం నుంచి రాత్రివేళ విధులు కూడా అమలు చేస్తాం. ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాల్లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండాలి. రాబోయే నాలుగు రోజుల పాటు ఇసుక రీచ్‌లలో తవ్వకాలను పూర్తిగా నిలిపివేస్తున్నాం. తుఫాన్ పునరావాస కేంద్రాల్లో మంచినీరు, బియ్యం, ప్రాథమిక వసతులు కల్పిస్తాం. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రాకూడద’ని తెలిపారు. మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’