Kaizer News

Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్..

Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!

· National - India · ntvtelugu.com

Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు! : --> Add as a preferred source on google Pat Cummins Praises on Cheteshwar Pujara: ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ తాను ఎదుర్కొన్న భారత బ్యాటర్లలో అత్యంత కఠినమైన ప్రత్యర్థి ఎవరో చెప్పాడు. టీమిండియా మాజీ టెస్టు బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా వెరీ టఫ్ అని పేర్కొన్నాడు. పుజారా క్రీజులో పాతుకుపోయి బౌలర్లను తీవ్రంగా విసిగించేవాడని చెప్పాడు. తాజాగా పలు దేశాల నుంచి తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్థులను ఎంపిక చేయాలని కమిన్స్‌ను అడిగారు. భారత్ నుంచి ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు ఏమాత్రం సందేహించకుండా పుజారా పేరును చెప్పాడు. చతేశ్వర్ పుజారాను ఔట్ చేయడం అంత సులభం కాదని, అతడు క్రీజులో ఎంతసేపైనా ఉండేందుకు సిద్ధంగా ఉంటాడని ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ‘భారత్ నుంచి టఫ్ బ్యాటర్ అంటే పుజారానే ఎంచుకుంటా. అతడిని ఔట్ చేయడం చాలా చాలా కష్టం. పుజారా క్రీజులో ఉంటే ఏదో మూలాన బాధగా ఉంటుంది. అతడు కావాలనుకుంటే 100 డాట్ బాల్స్‌ను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వడు’ అని కమిన్స్ చెప్పాడు. కమిన్స్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ప్రత్యర్థుల్లో ఎక్కువగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లనే ఎంపిక చేశాడు. పాకిస్థాన్ నుంచి మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను ప్యాట్ కమిన్స్ ఎంచుకున్నాడు. అజ్మల్ బౌలింగ్‌ను తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. ‘పాకిస్థాన్ నుంచి సయీద్ అజ్మల్. అతను ఒక ప్రత్యేకమైన బౌలర్. ఒకసారి ఓవర్ చివరి బంతికి నేను క్రీజులోకి వచ్చాను. అజ్మల్ బంతి వేశాడు. నేను ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే క్లీన్ బౌల్డ్ అయ్యాను. అలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. అజ్మల్ టఫ్ బౌలర్’ అని కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి అలిస్టర్ కుక్, దక్షిణాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్, న్యూజిలాండ్ నుంచి బ్రెండన్ మెకల్లమ్, శ్రీలంక నుంచి తిలకరత్నే దిల్షాన్, వెస్టిండీస్ నుంచి క్రిస్ గేల్‌ను కమిన్స్ తన జాబితాలో చేర్చాడు. చతేశ్వర్ పుజారా గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా 7,195 పరుగులు చేశాడు. 43.60 సగటుతో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు సాధించాడు. అలాగే భారత్ తరఫున ఐదు వన్డేలు ఆడి 51 పరుగులు చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత కమిన్స్ దక్షిణాఫ్రికాలో వన్డే జట్టుతో కలవనున్నాడు. అక్టోబర్ 9 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది

Original source: ntvtelugu.com
Read more on Kaizer News