Kaizer News

Srikakulam: శ్రీకాకుళంలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట

Srikakulam: శ్రీకాకుళంలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్: రూ.32.50 లక్షల సొత్తు స్వాధీనం

· State - Telangana · hmtvlive.com

Shorts Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో నాలుగు మండలాల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పలాస పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.32.50 లక్షల విలువైన బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. కాశీబుగ్గ సబ్‌డివిజన్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితులు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాకిమిడికి చెందినవారిగా గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుంచి 17 తులాల బంగారం, 1,640 గ్రాముల వెండి, రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మొత్తం రికవరీ చేసిన చోరీ సొత్తు విలువ సుమారు రూ.32.50 లక్షలు ఉంటుందని తెలిపారు. వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి, మెలియాపుట్టి మండలం పద్మాపురం, పాతపట్నం మండలంలోని శివశంకర్ కాలనీ, మొండిగల్లి వీధుల్లో నిందితులు దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందనీ అన్నారు. ఈ నెల 5వ తేదీన పాతటెక్కలి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేయగా ఈ నిందితులే దొంగతనం చేసినట్లు ఒక నిర్ధారణకు రాగా వారిని అదుపులో తీసుకొని విచారించగా మరిన్ని దొంగతనం కేసులు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News