Kaizer News

77వసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌

77వసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌

· State - Telangana · ntnews.com

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై మంతనాలు హైదరాబాద్‌, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోమారు ఢిల్లీ వెళ్తున్నారు. సెప్టెంబర్‌ 3వ తేదీన ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తారని సీఎం కార్యాలయం మీడియాకు లీకులు ఇచ్చింది. సీఎం ఢిల్లీకి వెళ్లడం ఇది 77వ సారి. సీఎం వెంట పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా వెళ్తారని చెప్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ క్రమశిక్షణ వంటి అంశాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానంతో వీరు చర్చిస్తారని తెలిసింది. మంత్రివర్గ విస్తరణ మీద చర్చలు జరుగుతాయని సీఎంవో కార్యాలయం లీకులు వదిలింది. దీనిని అధికారిక పర్యటనగా చెప్పుకొనేందుకు రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, పెండింగ్‌లో ఉన్న కేంద్ర నిధుల విడుదల అంశాలపై సీఎం పలువురు కేం ద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు సమయం కోరినట్టు చెప్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News