Kaizer News

Mahabubabad: తెలంగాణలో ఒడిశా వలస కూలీల బందీ.. వీడి

Mahabubabad: తెలంగాణలో ఒడిశా వలస కూలీల బందీ.. వీడియో వైరల్

· State - Telangana · hmtvlive.com

Shorts పర్లాఖెముండి: తెలంగాణ రాష్ట్రం మహబూబాబాదు జిల్లా సీతంపేట గ్రామంలో ఒడిశాకు చెందిన ఒడియా కార్మికులు బందీ అయి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం తమను రక్షించాలంటూ ఓ వీడియోను విడుదల చేశారు. వీరిలో ఇద్దరు తప్పించుకున్న స్వగ్రామానికి శుక్రవారం చేరుకున్నారు.వీరు గజపతి జిల్లా మోహన చంద్రగిరి పంచాయతీ పరిధిలోని బ్రహ్నసింగ్ గ్రామానికి చెందిన బీకి మండల్, ప్రదీప్ రైత్ గా తెలిసింది. అనంతరం వీరు అక్కడ జరుగుతున్న విషయాలను ఇలా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే మోహన, అర్ ఉదయగిరి, రాయగడ, నువాగడ, గంజాం జిల్లా దిగపొహండి సమితిలకి చెందిన 9 మంది కార్మికులు గత ఐదు రోజులుగా పస్తులు ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విరంతా గత ఏడు నెలల క్రితం పనుల నిమిత్తం గుత్తేదారు సహాయంతో తెలంగాణకు చేరుకున్నామని,గత మూడు నెలలుగా తాము చేసిన పనుల వేతనాలు చెల్లించేందుకు నిరాకరించేడమే కాక బెదిరింపులు చేస్తున్నట్లు ఆరోపించారు.అదే విధంగా అందరిని కలిపి గదిలో బంధించగా , తాము తప్పించుకొని గ్రామానికి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం వారి వద్ద డబ్బులు, భోజనానికి ఎలాంటి నిత్యవసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. ఈ విషయమై ఆర్ ఉదయగిరి ఎస్డీపీవో రాకేష్ కుమార్ సాహు వద్ద ప్రస్తావించగా ఘటనపై దర్యాప్తు చేపట్టి కార్మికులను రక్షించడం జరుగుతుందని తెలిపారు. గతంలో కూడా అడవా ఠాణా ప్రాంతానికి చెందిన పలువురు మైనర్ బాలికలను తెలంగాణ నుంచి రక్షించిన విషయం తెలిసిందే

Original source: hmtvlive.com
Read more on Kaizer News