Kurnool: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు గారు మరియు జిల్లా కుష్టువ్యాధి మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ గారు ఆసుపత్రి ఆవరణంలో ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు "ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర" వాహనాన్ని శనివారం ప్రారంభించారు. ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర" వాహనం పదిహెను రోజుల పాటు కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణ, వ్యాధి వ్యాప్తి మార్గాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. ప్రజలు ఎయిడ్స్‌పై అపోహలు వీడి, వ్యాధి నివారణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు