Kaizer News

Kotagiri | కోటగిరి లో ఘనంగా శ్రీ గణపతి దేవాలయం వార

Kotagiri | కోటగిరి లో ఘనంగా శ్రీ గణపతి దేవాలయం వార్షికోత్సవ వేడుకలు

· State - Telangana · ntnews.com

Kotagiri | కోటగిరి, ఆగస్టు 31 : కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో సంకట వియోచన శ్రీ గణపతి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం ఉదయం నుంచి దేవాలయంలో ఆలయ పూజారి దత్తాత్రి కులకర్ణి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిశేకాలు చేశారు. అనంతరం ఆలయంలో పలువురు దంపతులు యజ్ఞం హోమం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గణపతి దేవాలయం అధ్యక్షుడు కూచి సిద్ధు, ప్రధాన కార్యదర్శి బొట్టే గజేందర్, గర్దాస్ కిరణ్, అశోక్, వెంకటేశం, కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, పత్తి సాయిలు, పత్తి అబ్బయ్య, హనుమాన్లు, కునేపల్లి గంగారం, పోశెట్టి, ప్రభాకర్, శివలింగ్ తదితరులు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News