మీరు ప్రతిరోజు ఆఫీస్ లేదా బిజినెస్, ఇతర పనుల మీద బయటకు వెళ్తున్నారా.. మంచి మైలేజ్ ఇచ్చే, కావాల్సిన ఫీచర్లు ఉన్న ఒక స్కూటర్‌ను కొనాలనుకుంటే TVS Jupiter 110 ఒక మంచి ఆప్షన్ కావచ్చు. ఈ స్కూటర్ భారత ఆటో మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే టీవీఎస్ జుపిటర్ స్కూటీ తీసుకోవడానికి మీ వద్ద పూర్తి నగదు లేకపోయినా ఇబ్బంది లేదు, మీరు ఫైనాన్స్ ద్వారా ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చుర. మీరు తీసుకున్న నిర్ణీత గడువు వరకు ప్రతినెలా EMI చెల్లించాలి. TVS Jupiter 110 ధర వేరియంట్‌ను బట్టి మారుతుంది. ప్రస్తుతం బేస్ Jupiter Drum ధర సుమారు రూ. 77,175 నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్-షోరూమ్ ధరకు రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి ఖర్చులు కలిపితే ఆన్ రోడ్ ధర అవుతుందని తెలిసిందే. హైదరాబాద్‌లో ఈ బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ.87,439గా ఉంది. మీరు ఆన్ రోడ్ ధర చెల్లిస్తేనే వాహనం మీ సొంతం అవుతుంది. Jupiter 110 ని ఫైనాన్స్‌లో కొనుగోలు చేస్తే, కస్టమర్ తన వీలును బట్టి బట్టి డౌన్ పేమెంట్‌ను చెల్లించవచ్చు. డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువగా ఉంటే, లోన్ అంత తక్కువగా ఉంటుంది. దాంతో మీ నెలవారీ EMI కూడా తగ్గుతుంది. Jupiter బేస్ వేరియంట్ కోసం రూ.10000 డౌన్ పేమెంట్ చెల్లిస్తే 36 నెలల లోన్ టర్మ్.. 9.5 శాతం వడ్డీ రేటు అయితే EMI నెలకు సుమారు రూ. 2,480 చెల్లించాలి. మొత్తం వడ్డీ 11,877 చెల్లిస్తారు. ఒకవేళ 4 ఏళ్లకు అయితే ప్రతినెలా రూ.1,946 చెల్లించాలి. మొత్తం వడ్డీ 15,969 చెల్లిస్తారు. 5 ఏళ్లకు ఫైనాన్స్ తీసుకుంటే ప్రతినెలా ఈఎంఐ వాయిదా రూ.1626 చెల్లించాలి. మొత్తం వడ్డీ 20 వేల రూపాయలు పైగా చెల్లిస్తారు. 3cc ఇంజిన్ ఇచ్చారు. ఇందులో కంపెనీ iGO Assist సాంకేతికత అందిస్తుంది. ఇది అవసరమైన సమయంలో మెరుగైన పికప్, మైలేజ్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. iGO Assist ద్వారా మైలేజ్‌లో సుమారు 10 శాతం వరకు మెరుగుదల ఉంటుంది. Jupiter 110 లో రోజువారీ వినియోగానికి పనికొచ్చే పలు ఫీచర్లు ఉన్నాయి. ఇందులో LED లైటింగ్, డిజిటల్ న్‌స్ట్రుమెంట్ కన్సోల్, SmartXonnect వంటి ఫీచర్లు ఇచ్చారు. SmartXonnect ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, నోటిఫికేషన్లు వంటి సౌకర్యాలు లభిస్తాయి. ఫ్రంట్- మౌంటెడ్ ఫ్యూయల్ ఫిల్లర్ ఇచ్చారు. దీని వల్ల సీటు ఎత్తకుండానే పెట్రోల్ కొట్టించవచ్చు. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ లభిస్తుంది. జర్నీ సమయంలో మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. Jupiter 110 లో సుమారు 30 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు. డబుల్ హెల్మెట్ ఉంచే సౌకర్యం లభిస్తుంది. పొడవైన సీటు ఇచ్చారు. దీని వల్ల రైడర్, వెనుక కూర్చునే వ్యక్తికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. 79,999కే ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 301 కి.మీ. రేంజ్‌తో Ola S1Z సంచలనం! TVS కంపెనీ Jupiter 110 ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి కొత్త Dual Tone Spectral Range వేరియంట్ లాంచ్ చేసింది. ఇందులో కొత్త డ్యూయల్-టోన్ రంగులు, కొన్ని కొత్త లైటింగ్ ఫీచర్లు యాడ్ చేసింది. టీవీఎస్ కంపెనీ ఇందులో కంఫర్ట్, స్టైల్‌కు సంబంధించిన అప్‌డేట్లు ఇచ్చింది. Jupiter 110 అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాలెన్స్. ఇందులో రోజువారీ వాడకం