Kaizer News

Telangana Politics : సీఎం రేవంత్ రెడ్డి ఆఖరి అస్త్

Telangana Politics : సీఎం రేవంత్ రెడ్డి ఆఖరి అస్త్రం.. కేసీఆర్ నోరును తెరిపిస్తుందా.? గులాబీ బాస్‌ కొత్తవ్యూహం ఏమిటి?

· State - Telangana · 10tv.in

> Telangana Politics : కేసీఆర్ సభకు వస్తారు. కానీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడుతారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాట ఇది. చిల్లర మాటలు మాట్లాడే వారి ముందుకొచ్చి తాను సభలో పాల్గొనాలా.? అంటూ గులాబీ బాస్ కూడా సభకు రాబోనని తేల్చి చెప్పేశారు. ఇన్నాళ్లు సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని డిమాండ్లు చేసినా..ఎన్ని ఎత్తులు వేసినా..ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించేందుకు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఆఖరి అస్త్రాన్ని బయటికి తీశారన్న ప్రచారం నడుస్తోంది. ఎలాగైనా కేసీఆర్ నోరు తెరిపించాలి.. ఆయనతో వివరణ ఇప్పించాలనేదే రేవంత్ టార్గెట్ అని..అందుకోసం ఏ అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదంటున్నారు. . ఈ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్ష సూచన.. హెచ్చరికలు జారీ.. ఆ మాట కొస్తే కొత్త కొత్త పొలిటికల్ వెపన్స్‌ను బయటికి తీస్తూ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫాంహౌస్ ల్యాండ్స్‌లో దళితుల భూమి ఉందంటూ ఏకంగా విచారణకు ఆదేశించారు. ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతోంది. రెవెన్యూ అధికారులు ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. అదంతా అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కాగా .. కాంగ్రెస్ ఎంపీలు కేసీఆర్ ఫాంహౌస్ పరిశీలనకు వెళ్లడం మరో రాజకీయ ఎత్తుగడ అన్న టాక్ నడుస్తోంది. ఎంపీలు వెళ్లి అక్కడ చేసేదేం లేదని..జస్ట్ మీడియాలో హైప్ కోసం..కేసీఆర్ ఆస్తులు సంపాదించారని ఎక్స్‌పోజ్‌ చేసే ఎజెండాలో భాగంగానే ఫాంహౌస్ పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు. ప్రతీసారి వన్స్ మోర్ అంటూ కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్ల పాలనలో తెలంగాణకు బీఆర్ఎస్ ఏం చేసిందో..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఏం జరిగిందో..అసెంబ్లీలో ప్రజల ముందే చర్చిద్దామంటూ ఆ మధ్య సవాల్ చేశారు రేవంత్. చర్చలో తాను ఓడిపోతే ప్రజలకు క్షమాపణ చెబుతానని..కేసీఆర్ ఓడిపోతే ఫాంహౌస్‌కే పరిమితం అవుతారా అని ఛాలెంజ్ చేసిన సందర్భాలున్నాయి. కేసీఆర్ సభకు వస్తే ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తనదంటూ చెప్పుకొచ్చారు. ః ఇదంతా ఓ ఎత్తు అయితే..ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసు..ఇంకోవైపు విద్యుత్ కొనుగోళ్లపై విచారణ.. మరోవైపు కాళేశ్వరం దర్యాప్తు..ఇలా రకరకాల ఇష్యూస్‌తో కేసీఆర్ మౌనాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు సీఎం. అయినా నో కామెంట్ అంటూ సైలెంట్‌గా ఉంటూ వచ్చారు కేసీఆర్. ఫాంహౌస్‌లో నేతలతో భేటీ అయినా..పబ్లిక్ మీటింగ్‌లకు అటెండ్ అయినా..ఎక్కడా రేవంత్ పేరు తీయకుండానే ఈ ప్రభుత్వ పనితీరు బాలేదని..ప్రజలు సంతోషంగా లేరని చెప్పుకొంటూ వస్తున్నారు కేసీఆర్. దీంతో ఇన్నాళ్లు రేవంత్ వేసిన ఎత్తులేవి వర్కౌట్ కాలేదు. ప్రభుత్వం, సీఎం రేవంత్ చేసిన ఏ ఆరోపణపై కేసీఆర్ బయటికి వచ్చి రియాక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఫైనల్ పంచ్ ఇచ్చేందుకు ఫాంహౌస్ ల్యాండ్స్ చుట్టూ ఎంక్వైరీ అంటూ రచ్చకు తెరలేపారని అంటున్నారు. అధికార పార్టీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా..రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు కేసీఆర్ను ఉద్దేశించి పర్సనల్ అటాక్ చేసినా..దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేసినా..గులాబీ బాస్ రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. సీఎం రేవంత్ రెడ

Original source: 10tv.in
Read more on Kaizer News