తమిళ హీరో కార్తీక్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తీక్ నటించిన బ్లాక్‌బాస్టర్ మూవీ సర్దార్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్2’. పీఎస్ మిత్రన్ దర్శకుడు. సెప్టెంబరు 10న పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఈ తరహాలోనే ఓ ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు ఎస్‌జే సూర్యకు అక్కడి సిబ్బంది తాగడానికి ప్లాస్టిక్ బాటిల్లో నీరు అందించారు. దీనిని గమనించిన సూర్య తనదైన శైలిలో ‘నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా..?ఈ సర్దార్‌కి కూడా ఇదేనా’ అని కోపంగా అంటూ నవ్వులు పూయించాడు. పక్కనే ఉన్న హీరో కార్తీ తన వాటర్ బాటిల్‌ను సూర్యకు అందించారు. సినిమా కాన్సెప్ట్‌కి.. కాగా ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల ఆరోగ్యం పోతోంది అంటూ తీసిన సర్దార్ సినిమా కాన్సెప్ట్‌కి ఈ సంఘటన తోడు కావడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించనున్నాడు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిష్ విజయన్ హీరోయిన్లు కాగా సీఎస్ సామ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదీ చదవండి: కింగ్‌తో.. కింగే పోటీ.. ఆ రోజు ఏం జరగబోతోంది? షూటింగ్ కోసం ఓనం మిస్.. ర్యాండమ్ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు) ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు