భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదల సుదీర్ఘకాల సొంతింటి నిరీక్షణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సింగన్నగూడెం వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సోమవారం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు అధికారికంగా అందజేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో 444 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ, కనీస మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, రోడ్లు,డ్రెయినేజీ వ్యవస్థలను పట్టించుకోలేదు. దీంతో పంపిణీ నిలిచిపోయి నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి, ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల పనులను పూర్తి చేయించి ఇళ్ల పంపిణీకి మార్గం సుగమం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం 360 డిగ్రీల సమగ్ర సర్వేను నిర్వహించింది. క్షేత్రస్థాయిలో చేపట్టిన ఈ విచారణ ద్వారా.. గతంలో అక్రమంగా జాబితాలోకి వచ్చిన అనర్హుల పేర్లను తొలగించారు. నిజమైన నిరుపేదలకు ఇళ్లు దక్కేలా అత్యంత పారదర్శకమైన జాబితాను అధికారులు సిద్ధం చేశారు. సముదాయంలోని మొత్తం 444 ఇళ్లలో మొదటి విడత కింద 408 ఇళ్ల తాళాలను సోమవారం లబ్ధిదారులకు అందజేయనున్నారు. మిగిలిన 36 ఇళ్లను రెండో విడతలో పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఏళ్ల తరబడి కాగితాలకే పరి మితమై, నిర్మాణం పూర్తయినా పంపిణీకి నోచుకోని ఇళ్లు ఇప్పుడు లబ్ధిదారుల చేతికి రానుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సొంతింటి కల నెరవేరుతుండటంతో లబ్ధిదారులు పండుగ వాతావరణంలో గృహప్రవేశాలకు సన్నద్ధమవుతున్నారు. ఫ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా అందించేందుకు ఏర్పాట్లు ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు.. రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?