Kaizer News

Kadiyam: ఘనంగా దూడల నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి వేడ

Kadiyam: ఘనంగా దూడల నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి వేడుకలు

· State - Telangana · hmtvlive.com

Shorts కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ మాజీ సర్పంచ్ దివంగత దూడల నాగేశ్వరరావు(డీ ఎన్ ఆర్)సేవలు ప్రశంసనీయమని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు... దుళ్ళ లో డిఎన్ఆర్ నివాసం వద్ద ప్రధమవర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి అన్నoదేవుల చంటి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు తదితర ప్రముఖ నేతలు మాట్లాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాలలో పనిచేసిన డిఎన్ఆర్ రెండుసార్లు సర్పంచ్ గా విజయదుందబి మోగించారన్నారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు ఆర్ అండ్ బి మంత్రిగా ఉండగా గ్రామంలో ప్రధాన రహదారులు అన్నిటిని సిసి రహదారులుగా మార్పు చేయడంలో డిఎన్ఆర్ కృషి ఉందన్నారు . నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు లోనూ, పాత గ్రామపంచాయతీ నిర్మాణంలోనూ, పాఠశాల అభివృద్ధిలోనూ ఆయన నిస్వార్ధంగా పనిచేశారని పేర్కొన్నారు.. అనంతరం డిఎన్ఆర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బత్తుల రాము, ఆదిమూలం సాయిబాబా, రేమెళ్ళ ప్రసాద్, సూరపురెడ్డి జానకిరామ్, ఈదర దీన్ దయాళ్, ఈలి గోపాలం, సూరపురెడ్డి భరత్, తోకల శ్రీనివాస్, కొండయ్య మాస్టర్, తూము శ్రీనివాస్, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత సత్తి భాస్కర్ రెడ్డి (కంద రెడ్డి), ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాస్, ప్రముఖ గుత్తేదారు మల్లిడి సత్యనారాయణ రెడ్డి, రాయగడ శ్రీ క్షేత్ర టౌన్షిప్ యజమాని దూడల శ్రీనివాస్, ఆంధ్రభూమి మాజీ ఎడిషన్ ఇంచార్జ్ మద్దాల పెద సత్యనారాయణ,కడియం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిక్కాల సూరిబాబు, కార్యదర్శి సూర్యచంద్రరావు, సీనియర్ జర్నలిస్టు కొండ్రెడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News