Kaizer News

పిడుగుపాటుతో రెండు గొర్రెలు మృతి

పిడుగుపాటుతో రెండు గొర్రెలు మృతి

· State - Telangana · prabhanews.com

ముగ్గురు గొర్రెల కాపరులకు తప్పిన పెను ప్రమాదం కుంటాల, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుంటాల మండలం విట్టాపూర్ గ్రామంలో ఆదివారం పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు పంట పొలాల్లో గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో సమీపంలోని చెట్టుపై పిడుగు పడటంతో రెండు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలను మేపుతున్న బేగడి చిన్న సాయన్న, లింగన్న, ధనంజయ్‌లకు గాయాలయ్యాయి. గ్రామస్థులు వెంటనే వారిని బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పిడుగు పడిన సమయంలో పెద్ద శబ్దంతో చెట్టుపై నిప్పు రవ్వలు చెలరేగి కిందకు పడటంతో ముగ్గురు కాపరులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు గురయ్యారు. గాయపడిన ముగ్గురికి బైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు గ్రామస్థులు తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News