Kaizer News

Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రా

Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు

· State - Telangana · telugu.abplive.com

పోలీసు కస్టడీలో చిత్రహింసలతో సాయికృష్ణ మరణించినట్లు సిట్ తెలిపింది. సీఐ ఆదేశాలతో అర్ధరాత్రి మృతదేహాన్ని శ్మశానానికి తరలించి కాల్చారు. A4 సురేష్ సాక్ష్యాలు చెరిపివేసి, కుటుంబ సభ్యులను బెదిరించాడు. పరారైన సురేష్ మూడు నెలల తర్వాత సిట్ ముందు లొంగిపోయాడు. అమరావతి: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ మరణం కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) రిమాండ్ రిపోర్టు ద్వారా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కస్టడీలో తీవ్ర వేధింపులు, టార్చర్ కారణంగానే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయాడని సిట్ తెలిపింది. అనంతరం ఆ మృతదేహాన్ని రహస్యంగా తరలించి దహనం చేయడంలో ఏ4 నిందితుడైన గులివిందల సురేష్ కీలక పాత్ర పోషించాడని సిట్ స్పష్టం చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన సురేష్‌కి అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజు (ఏ1)తో 2010 నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ పరిచయంతోనే సీఐ ఆదేశాల మేరకు ఇతర నిందితులతో కలసి సాక్ష్యాలను మాయం చేసేందుకు, మృతుడి కుటుంబ సభ్యులు హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేసేందుకుగానూ మధ్యవర్తిగా వ్యవహరించాడని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మే 7న కృష్ణలంక పీఎస్‌కు వెళ్లిన సాయికృష్ణ సిట్ సమర్పించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మే 7న సురేష్ కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు వెళ్లగా సీఐ నాగరాజుతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని కలిసి సాయికృష్ణను విచారించారు. ఆ తర్వాత సురేష్ నేపాల్ పర్యటనకు వెళ్లి మే 11న తిరిగి విజయవాడ చేరుకున్నాడు. మే 12న ఉదయం సీఐని కలిసేందుకు స్టేషన్‌కు వెళ్లిన సురేష్‌ను, అశోక్ రాణిగారితోటలోని ఒక ఖాళీ భవనానికి తీసుకెళ్లాడు. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురైన సాయికృష్ణను ఉంచారు. చిత్రహింసల గురించి సురేష్‌తో మొరపెట్టుకుంటూనే సాయికృష్ణ స్పృహతప్పి పడిపోగా, పరిశీలించిన సిబ్బంది అతను మరణించినట్లు నిర్ధారించారు. వెంటనే సమాచారం అందుకున్న సీఐ నాగరాజు, చీకటి పడ్డాక శవాన్ని దహనం చేయాలని వారిని ఆదేశించారు. దీంతో అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో నిందితులు అశోక్, నానిలు సాయికృష్ణ మృతదేహాన్ని ఒక దుప్పట్లో చుట్టి, ఎవరికీ అనుమానం రాకుండా బైకు మీద కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశానవాటికకు తరలించారు. సురేష్ మరొక బైక్‌పై వారిని ఫాలో అయ్యాడు. శవాన్ని పూర్తిగా దహనం చేసి, ఎలాంటి ఆనవాళ్లు లేకుండా ఆధారాలను నాశనం చేశారు. విచారణ సమయంలో బాధితుడిని దుస్తులు లేని స్థితిలో తీసిన ఫోటోలను సత్యనారాయణ అనే హెడ్ కానిస్టేబుల్ ఫోన్ నుంచి సురేష్ డిలీట్ చేశాడు. కేసు తీవ్రతరం కాకుండా మే 31న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో సాయికృష్ణ మేనమామలను సురేష్ కలిసి భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారడంతో జూన్ 23న సీఐ నాగరాజు అరెస్ట్ కాగానే, సురేష్ తన ఫోన్‌ను ధ్వంసం చేసి విజయవాడ నుంచి హైదరాబాద్, నాగ్‌పూర్ ప్రాంతాలకు పరారయ్యాడు. దాదాపు 3 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న అతను గురువారం (సెప్టెంబర్ 17న) సిట్ అధికారుల ముందు లొంగిపోయాడు. శుక్రవారం ఉదయం సిట్ సిబ్బంది సురేష్‌ను సంఘ

Original source: telugu.abplive.com
Read more on Kaizer News