Kaizer News

Financial Aid | బీఆర్‌ఎస్‌ నాయకుడి కుటుంబానికి ఆర్

Financial Aid | బీఆర్‌ఎస్‌ నాయకుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

· State - Telangana · ntnews.com

జగిత్యాల / ఎండపల్లి : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం గొల్లకోట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ ( Jagan ) కుటుంబానికి బీఆర్ఎస్ ( BRS ) పార్టీ అండగా నిలిచింది. అధిష్టానంతో పాటు నియోజకవర్గ నాయకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ( Koppula Eshwar ) కలిసి రూ.21,36,000ను జగన్‌ ఇంటికి వెళ్లి కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జగన్ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతానికి జగన్ చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. జగన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News