టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత కార్యవర్గంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మెజార్టీ డ్యాన్సర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించి, యూనియన్‌ను ముందుకు నడిపించే సత్తా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ను అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న సుమలత, ఆమె కార్యవర్గ తీరును వ్యతిరేకిస్తూ డ్యాన్సర్లు మూకుమ్మడిగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందులో భాగంగా సుమలత ప్యానెల్‌కు ఇప్పటికే అధికారికంగా సహాయ […]