Kaizer News

'వైభవ్‌లో ఆ స్కిల్స్ లేవు.. టెస్టు క్రికెట్‌కు సెట

'వైభవ్‌లో ఆ స్కిల్స్ లేవు.. టెస్టు క్రికెట్‌కు సెట్ కాడు'

· Sports · sakshi.com

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్.. భవిష్యత్తులో టెస్టు ఫార్మాట్‌లో రాణించడానికి ఇబ్బంది పడతాడని పనేసర్ అభిప్రాయపడ్డాడు. అండర్-19 తో పాటు ఐపీఎల్‌లోనూ సంచలన ప్రదర్శన చేసి భారత సీనియర్ జట్టులో​కి అడుగు పెట్టిన వైభవ్‌.. తన అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికి తుది జట్టులో మాత్రం ఈ చిచ్చర పిడుగుకు చోటు దక్కలేదు. కాగా సూర్యవంశీ కేవలం వైట్‌బాల్ క్రికెట్‌లోనే కాదు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్‌లోనూ ఈస్ట్‌జోన్ తరపున సూర్యవంశీ సత్తాచాటాడు. అంతకుముందు ఆస్ట్రేలియా అండర్‌-19తో జరిగిన యూత్ టెస్టు సిరీస్‌లోనూ అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికి వైభవ్ టెస్టు క్రికెట్‌లో విజయవంతం కాలేడని పనేసర్ వ్యాఖ్యనిచండం గమనార్హం. "వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్‌లో సక్సెస్ అవుతాడని నేను అనుకోవడం లేదు. అతడి ఆ స్ధాయికి తగ్గ స్కిల్స్ లేవు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టెస్టులు, టీ20లు రెండింటిలోనూ టాప్-10లో కొనసాగుతున్న ఏకైక బ్యాటర్ హ్యారీ బ్రూక్ మాత్రమే" అని పనేస‌ర్ పేర్కొన్నాడు. చదవండి : భారత జ‌ట్టులో అత‌డి పేరు చూసి షాక‌య్యా! బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News