Kaizer News

Nepal | వరదల్లో చిక్కుకున్న 20మంది గుర్తింపు..

Nepal | వరదల్లో చిక్కుకున్న 20మంది గుర్తింపు..

· State - Telangana · prabhanews.com

Nepal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న వారిలో 20 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. టిబెట్‌ సరిహద్దులోని కొడారి ప్రాంతానికి సుమారు 145 మంది యాత్రికులు చేరుకుని ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. అనంతరం వారు ఖాఠ్మాండు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. యాత్రికులను మంగళవారం విమానంలో ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల వివరాల జాబితాను ఢిల్లీలోని ఏపీ భవన్‌ కంట్రోల్‌ రూమ్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News